హైదరాబాద్ మెట్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

మెట్రో వెబ్ సైట్ లో దరఖాస్తు వివరాలు

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్‌ః హైదరాబాద్ మెట్రో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పోస్టుల వివరాలు, అర్హతలు, ఉద్యోగాల దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను వెల్లడిస్తూ.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com వెబ్సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ లోకి వెళ్లాలి. కరెంట్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేసి మీకున్న అర్హతలతో పాటు అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అర్హతలకు సంబంధించిన వివరాలను [email protected] కు మెయిల్ చేయాలి.

ఖాళీగా ఉన్న పోస్టులు..
ఏఎంఎస్ ఆఫీసర్ (1), సిగ్నలింగ్ టీమ్ (2), రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ (6), ట్రాక్స్ టీమ్ లీడర్ (2), ఐటీ ఆఫీసర్ (1)

కావాల్సిన అర్హతలు..
ఏఎంఎస్ ఆఫీసర్: ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి
సిగ్నలింగ్ టీమ్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం
రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం
ట్రాక్స్ టీమ్ లీడర్: సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 7 ఏళ్ల అనుభవం
ఐటీ ఆఫీసర్: బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ, 1 నుంచి 2 ఏళ్ల అనుభవం