ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు

కరోనా వైరస్‌ కట్టడికి ముందస్తు చర్యలు

Seetha Raamula kalyanam

ఒంటిమిట్ట : ఆంధ్రా అయోధ్య ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు అయ్యింది.

కోరలుచాస్తున్న కరోనా ఎఫెక్ట్‌ సీతారాముల కళ్యాణంపై కూడ పడింది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కరోనా ప్రభా వంతో భారీగా భక్తులు లక్షల కొద్ది తరలివచ్చే ఒంటిమిట్ట సీతా రాముల కళ్యాణ మహోత్సవంలో కరోనా ప్రభావం చూపకుండా ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ఎకె సింఘాల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం నిర్వహించే విషయమై నివేదిక పంపారు.

నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఉన్నతస్థాయి చర్చలఅనంతరం కల్యాణం నిర్వహించే విష యమై ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఎందుకంటే కనీసం

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/