టీడీపీ పార్టీని జూ.ఎన్టీఆర్‌కు అప్పగించండి అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి పార్టీ ని జూ. ఎన్టీఆర్ అప్పగించాడని అని అన్నారు. యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ మాట్లాడుతూ..జూ. ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానం ఫై స్పందించారు.

” జూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని నారా లోకేష్‌ ను కొంతమంది ప్రశ్నించగా.. దానికి నారా లోకేష్‌ సమాధానం ఇస్తూ, నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం.. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో.. ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి.. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో? వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి..” అంటూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే, దీనిపై కొడాలి నాని స్పందించారు.

జూ ఎన్టీఆర్ కు టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగించి చంద్రబాబు మరియు నారా లోకేష్ పార్టీ నుంచి తప్పుకోవాలని నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ను నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం ఏంటని మండిపడ్డారు. టిడిపి పార్టీ ఆయన తాతస్థాపించిన పార్టీ అని గుర్తు చేశారు. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదని…టీడీపీ పార్టీలో రావాలని పేర్కొన్నారు. జగన్ ను ఓడించే దమ్ము లేక జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అడుగుతున్నారని నాని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా… జగన్‌ ను ఓడించలేరని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, కాదు, ప్రభాస్‌, మహేష్‌ బాబు వచ్చినా ఏం కాదన్నారు.