హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. గత మూడు రోజులుగా నగరం లో వర్షం పడుతూనే ఉంది.
ఈరోజు కూడా నగరంలోని పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహాదారుల పైకి భారీగా నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

ఈరోజు ఖైరతాబాద్, లక్డీ కపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపుం, హిమాయత్ నగర్, గాంధీ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, కవాడీ గూడ, ఆబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, బషీర్‌బాగ్, కోఠి, సుల్తాన్‌బజార్‌, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.