మోడీ అద్భుతంగా పాలిస్తున్నారుః డొనాల్డ్ ట్రంప్

ఇండియాకు తానే మంచి స్నేహితుడినని వ్యాఖ్య

donald-trump-pm modi

వాషింగ్టన్ః భారత ప్రధాని మోడీపై మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని మోడీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఇండియాకు తనకంటే మంచి ఫ్రెండ్ లేడని చెప్పారు. తద్వారా 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలబడబోతున్నాననే సంకేతాన్ని ఇచ్చారు.

అన్ని పోల్స్ లోనూ తాను లీడింగ్ లో ఉన్నానని… అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై త్వరలోనే తాను క్లారిటీ ఇస్తానని ట్రంప్ చెప్పారు. జో బైడెన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ లలో భారత్ కు ఎవరు మంచి మిత్రుడనే ప్రశ్నకు సమాధానంగా… ఈ ప్రశ్నను మోడీని అడగాలని సరదాగా అన్నారు. తన వరకైతే భారత్ తో ట్రంప్ కంటే ఎక్కువ స్నేహం ఎవరూ చేయలేదని చెప్పగలనని తెలిపారు. భారత్ తో, మోడీతో తనకు బలమైన అనుబంధం ఉందని చెప్పారు. భారత ప్రధాని పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని… మోడీ అద్భుతంగా పాలిస్తున్నారని అన్నారు. మోడీ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/