ఒమిక్రాన్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ఒమిక్రాన్ సోకిన వారికి టిమ్స్ లో చికిత్స అందిస్తామని హైదరాబాద్ సీపీ వ్యాఖ్య

హైదరాబాద్: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఒమిక్రాన్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతే బయటకు రావాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి గచ్చిబౌలిలోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ గుర్తించామని… వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నామని అంజనీ కుమార్ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/