రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ భేటి

Rahul Gandhi -Sachin Pilot

జైపూర్ : మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సోమవారం రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సమావేశమైనట్లు అక్కడి రాజకీయవర్గాలు చెప్తున్నాయి. పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సచిన్ పైలట్ తో సమావేశాన్ని హైకమాండే స్వయంగా ప్రారంభించినట్లు సమాచారం. పలు అంశాలపై రాహుల్ తో పైలట్ చర్చించినట్లు తెలిసింది. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ అసంతృప్తి పార్టీపైన కాదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ పైనే అని ఇప్పటికీ చెప్తున్నారు. సచిన్ పైలట్ పార్టీ నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాజస్థాన్‌లో ప్రభుత్వ సంక్షోభం పరిష్కరమవుతుందని పార్టీ హామీ ఇచ్చిందని బాహాటంగా అంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/