నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

cm-jagan-will-release-the-jagananna-vidya deevena-scheme-funds

అమరావతిః సిఎం జగన్‌ నేడు జగనన్న విద్యాదీవెన పథకం నిధులను విడుద చేయనున్నారు. జూలై–సెప్టెంబర్‌ కు సంబంధించిన ఫండ్స్ ను జగన్‌ రిలీజ్ చేస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. ఆర్థిక స్తోమత లేనందున చాలా మంది చిన్నారులు పాఠశాలకు రావడం లేదు. వీరి ఇబ్బందులు, పరిస్థితులు గమనించిన జగన్ ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రభుత్వమే అందిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్‌ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీలకూ ప్రయోజనం లభిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదనే చెప్పాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా అభ్యసించేందుకు పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/