వివేకా హత్యకేసు.. సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. దాదాపు నెలరోజుల తర్వాత సీబీఐ విచారణ జరుగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ హత్య కేసులో వారి ప్రమేయానికి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: