బలగం చిత్రానికి అంతర్జాతీయ గౌరవం

జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన బలగం మూవీకి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. తెలంగాణ నేపథ్యం కథ గా ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఈ సినిమా ప్రశంసలకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేట్రికల్‌గా మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇలా అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ గౌరవం దక్కింది.

అమెరికాలోని లాస్ ఏజెంలెస్ సినిమాటోగ్రఫి అవార్డు (LACA)లో బలగం సినిమా సినిమాటోగ్రపి విభాగం సత్తా చాటుకొన్నది. ఈ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆచార్య వేణును అవార్డు వరించింది. ఇంకా ఉత్తమ చిత్రంగా కూడా బలగం అవార్డును అందుకొన్నది. ఈ అవార్డును దర్శకుడు వేణుకు అందజేశారు.