మంచు విష్ణు కార్యాలయంలో చోరీ

రూ. 5 లక్షల విలువ చేసే సామగ్రి మాయం
హెయిర్ డ్రెస్సర్‌పై అనుమానం

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురైంది. హెయిర్ డ్రెస్సర్ అయిన నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/