ఢిల్లీకి ఉగ్రవాద దాడి.. హై అలెర్ట్ ప్ర‌క‌టించిన పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్ర‌వాద దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఇచ్చిన స‌మాచారంతో దేశ రాజ‌ధానిలో సెక్యురిటీ టైట్ చేశారు పోలీసులు. ఉగ్రవాద దాడులను చేస్తామని కొన్ని ఈ మెయిళ్లు వచ్చిన నేపథ్యంలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. తెహ్రిక్ ఇ తాలిబన్ ఉగ్రవాద సంస్థ నుంచి ఈమెయిళ్లు వచ్చిన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఈమెయిళ్ల వివరాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులకు పంపారు. వచ్చిన వివరాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు .. న్యూఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్ లో సోదాలు నిర్వహించారు. కొన్ని భద్రతపరమైన ముప్పు కారణంగా… గట్టి నిఘాను పాటించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇమెయిల్ పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది…. ఎవరు పంపారనే దానిపై ఆరా తీస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/