జపాన్‌లో భారీ భూకంపం..

earthquake-jolts-assam-again

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:42 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్‌ మెటరాలజికల్‌ ఏజెన్సీ తెలిపింది. సెంట్రల్‌ జపాన్‌ లోని ఇషికావా ప్రిఫెక్చర్‌ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది.

భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అయితే సముద్ర మట్టంలో 20 సెం.మీ కంటే తక్కువలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.