నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న జగన్

ఈరోజు ఢిల్లీలో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. నీతిఆయోగ్‌ చైర్‌పర్సన్‌, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. 2019 జూలై తర్వాత మొదటిసారిగా భౌతికంగా జరుగుతున్న ఈ సమావేశంలో.. నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం.. జాతీయ విద్యా విధానం తదితర కీలకాంశాలపై చర్చించనున్నారు. కాగా.. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్‌ ఆరోపణలను నీతిఆయోగ్‌ ఖండించింది.

75 వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకోబోతున్న ఈ సమయంలో, సమాఖ్య వ్యవస్థకు స్పూర్తిగా రాష్ట్రాలు మరింత శక్తివంతంగా, “ఆత్మ నిర్బర్ భారత్” ను ఆవిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన లో వెల్లడించనున్నారు. ఈ ఏడాది జూన్ లో ధర్మశాలలో ప్రధాని అధ్యక్షతన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో జరిగిన సమావేశంలో “అజెండా” పై చర్చ జరుగనుంది. రాష్ట్రపతి భవన్ “కల్చరల్ సెంటర్” లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సమావేశంలో G-20 సమావేశ వేదిక పై రాష్ట్రాలు తమ పురోగతిని ప్రదర్శించుకునే అవకాశమని అధికారిక ప్రకటన లో వెల్లడించనున్నారు.