తేనెతో గుండెపోటు నివారణ !

ఆరోగ్య సంరక్షణ

honey to prevent heart attacks!
Honey to prevent heart attacks!

తేనెతో గుండెపోటు నివారణ సాధ్యమా? రక రకాల తీపి పదార్ధాల వలన తీపిని అందించే పదార్ధాలను గ్లూకోస్, మాల్టాజ్ , సుక్రోజ్, ప్రక్టోజ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే.. అలాగే తేనె తీపిని ఇచ్చే పదార్ధాన్ని ట్రెహలజ్ అంటారు.. కొన్ని ఎలుకల శరీరాల్లోకి దీన్ని ఇంజెక్ట్ చేస్తూ నిర్వహించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగా జేస్తున్నాయట..

తేనెల వలన ట్రెహలజ్ ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ప్లాక్ చిఱ్ఱెదట.. పైగా గతంలో చేరిన ప్లాక్ లు దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కన్పించింది.. అయితే ఈ ట్రెహలజ్ ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోని లేదా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన మూషికాల్లో ఈ విధమైన తగ్గుదల కన్పించలేదు..

గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలజ్ సహాయంతో రక్తనాళాల్లోని పాచిని తలగించి. తద్వారా గుండెపోటు ముప్పును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.. ఇలా చక్కెరకు బదులు తేనే వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా? అనే అంశంపై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/