కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు : సీఎం జగన్

Hon’ble CM will be Distributing Financial Assistance to Beneficiaries under Welfare Schemes LIVE

అమరావతి: అర్హులంద‌రికీ సాయం అందాల‌ని, ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌దే ఉద్దేశ్య‌మ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం జ‌గ‌న్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

12ప‌థ‌కాల్లో 9.30ల‌క్ష‌ల మందికి రూ.702కోట్ల సాయం అందించ‌నున్నారు. ఈ ప‌థ‌కాల‌కు ఏ ఒక్క‌రూ మిస్ కాకుడ‌ద‌న్నారు. వైఎస్ ఆర్ చేయూత కింద 2.50ల‌క్ష‌ల మందికి రూ.470కోట్లు,రైతు భ‌రోసా కింద 2.86ల‌క్ష‌ల మందికి రూ.59కోట్లు, కులం,మ‌తం,పార్టీ చూడ‌కుండా ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. టీడీపీ హ‌యాంలో 39ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే పెన్ష‌న్లు ఇచ్చేవార‌ని, ఇప్పుడు 61ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి పెన్ష‌న్ 2500అవుతుంద‌న్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/