వైఎస్‌ వివేకా హత్యకేసు సిబిఐకి అప్పగింత

ఆదేశాలు జారీ చేసిన ఏపి హైకోర్టు

ys vivekananda reddy murder case to cbi
ys vivekananda reddy murder case to cbi

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపి హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యకేసుపై సిబిఐ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసును సిబిఐ కి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. వైఎస్ వివేకా కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పిటీషన్‌పై వాదనలను విన్న తరువాత.. విచారణను సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/