కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేసిన సీఎం జగన్‌

అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble CM of AP will be Participating in Bhoomi Pooja of Hare Krishna Gokula Kshetram LIVE

అమరావతి : కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్‌ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.

అంతకముందు సీఎం జగన్ మగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్‌ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/