గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన యాదవ సంఘం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌పై తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదవ జేఏసీ గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ ఇందిరా పార్క్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ యాదవ జేఏసీ ఇచ్చిన గడువు ముగియడంతో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ నుంచి గాంధీభవన్‌కు నిరసనగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గాంధీ భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మొహరించారు.