వైద్య ఆరోగ్య రంగానికి 2 లక్షల కోట్లు.. మోడీ

డాక్టర్స్ డే కార్యక్రమంలో మోడీ

YouTube video
PM Modi addresses medical fraternity on Doctors’ Day

న్యూఢిల్లీ : నేడు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వైద్యులను దేవుడికి మరో రూపంగా పిలుస్తామన్నారు. కరోనా మహహ్మమారిని ఎదుర్కోవడంలో డాక్టర్లు ముందున్నారు …కరోనా లాంటి క్లిష్ట సమయంలో వైద్యులు ప్రజలకు అపారమైన సేవలందించారని ప్రధాన కొనియాడారు. దేశంలోని వైద్యులందరికీ ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. ఇంతలా పని చేసి ప్రజల ప్రాణాలను నిలబెట్టారు.

కోవిడ్ కారణంగా చాలా మంది వైద్యులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. వైరస్ రకరకాలుగా మ్యూటేట్ అవుతున్నా… వైద్యుల అవగాహన కూడా పెరుగుతోంది’’ అంటూ మోడి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వైద్య రంగంపై అధికంగా కృషి సలుపుతోందని, గతంలో 15 వేల కోట్లను కేటాయించిందని, ఈ సారి రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మోడి గుర్తు చేశారు.  వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి 50 వేల కోట్ల రూపాయలతో ఓ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను కూడా పరిచయం చేశామని అన్నారు. వైద్యుల రక్షణ, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంంటుందని మోడీ హామీ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/