మూడో విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’

YouTube video
Hon’ble CM of AP will be Disbursing ”YSR Nethanna Nestham” Virtually from Camp Office LIVE

అమరావతి: సీఎం జగన్ మూడవ విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ఆర్ధిక సాయం అమలు చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నాం.

మూడో విడత కింద రూ.192.08 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/