హోలీ వేళ విషాదాలు.. తెలంగాణ లో 17 మంది దుర్మరణం

నిన్న (సోమవారం ) దేశ వ్యాప్తంగా హెలి సంబరాలు అంబరాన్ని తాకాయి. కుల బాధ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు హోలీ వేడుకలను జరుపుకున్నారు. సినీ , రాజకీయ ప్రముఖులు సైతం తమ తమ కుటుంబ సభ్యులతో ఎంతో హుషారుగా హోలీని జరుపుకోగా..కొన్ని కుటుంబాల్లో మాత్రం హోలీ విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి 17 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్లో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, జగిత్యాలలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి కన్నుమూసింది. ఇలా దాదాపు రాష్ట్రంలో 17 మంది మృతి చెందడం వారి వారి కుటుంబాల్లో విషాదం నింపింది.