ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కేజ్రీవాల్ దీపావళి బోనస్

Kejriwal

న్యూఢిల్లీః ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావళి పండుగకు గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపుగా 80 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం రూ.56 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. నాన్-గెజిటెడ్, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా ఏడు వేల రూపాయలు బోనస్ ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.