కరోనాపై సిఎం ఉన్నత స్థాయి కమిటి భేటి

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిపై సిఎం కెసిఆర్‌ అధ్యక్షత అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కరోనాపై ఇతర రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపై కూడా సమీక్షించి క్యాబినేట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/