జలమయంగా మారిన హైదరాబాద్

heavy-rain-at-midnight-in-hyderabad

మరోసారి మహానగరం వణికిపోయింది. గురువారం రాత్రి భారీవర్షం కురిసింది. దీంతో ఆఫీస్ లనుండి ఇంటికి చేరవలసిన వారంతా రోడ్లపై తడిసిపోముద్దయ్యారు. ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా నీరే తప్ప రోడ్లు కనిపించలేదు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించే ప్రయత్నం చేసారు. సాయంత్రం కురిసిన వానతో పలు ప్రాంతాలు జలమయం కాగా.. మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో నగరవాసులను వణికిపోతున్నారు. అత్యవసరమైతే గానీ ప్రజలెవరూ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా 19 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలను జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దించారు.