పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడం సాధ్యం కాదు

ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమన్న హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఏపి ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కరోనా విధుల్లో నిమగ్నమై ఉందని, ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది. అటు, అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/