మొబైల్‌ కాంగ్రెస్‌(ఐఎంసి)లో ప్రసంగించిన ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi’s address at the Virtual India Mobile Congress (IMC) 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మొబైల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఇవాళ ప్ర‌సంగించారు. మీలాంటి వారి ఆవిష్క‌ర‌ణ‌లు, ప్ర‌య‌త్నాల వ‌ల్లే మ‌హ‌మ్మారి కాలంలోనూ ప్ర‌పంచం స‌జావుగా సాగుతోంద‌న్నారు. టెక్నాల‌జీలో వ‌చ్చిన అప్‌డేట్ వ‌ల్ల‌.. హ్యాండ్‌సెట్ల నుంచి గ్యాడ్జెట్ల‌కు మారామ‌ని, అయితే ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాల అంశంలో టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ ఏదైనా ఆలోచించాల‌న్నారు. టెలికం ప‌రిక‌రాల‌ను, డిజైన్‌, డెవ‌ల‌ప్మెంట్‌, ఉత్ప‌త్తి విష‌యంలో భార‌త్‌ను ప్ర‌పంచంలోనే టెలికాం హ‌బ్‌గా మార్చాల‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మొబైల్ టెక్నాల‌జీ వ‌ల్ల కోట్ల‌ల్లో క్యాష్‌లెస్ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని, దీని వ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌న్నారు. టోల్‌బూత్‌ల వ‌ద్ద కూడా కాంటాక్ట్‌లెస్ సేవ‌లు సాధ్య‌మైన‌ట్లు చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/