2024 లో జనసేన అసెంబ్లీ లో అడుగుపెడుతుంది – పవన్ కళ్యాణ్

జనసేన ధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మార్చి 14 , 2023 నాటికీ 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా మచిలీపట్నం లోని పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించారు. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఆటోనగర్ నుండి తన వారాహి ఫై ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో లో జనసేన శ్రేణులు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావడం తో వారాహి ముందుకు వెళ్లలేకపోయింది. ఆటోనగర్ నుండి మచిలీపట్నం రావడానికి దాదాపు 07 గంటల సమయం పట్టింది. దీంతో సభ పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి 12 అయ్యింది. అయినప్పటికీ సభకు హాజరైన వారంతా ఏమాత్రం ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగం విని వెళ్లడం జరిగింది.

ఈ సభ లో పవన్ కళ్యాణ్ పొత్తుల ఫై , బిజెపి తో అనుబంధం ,అలాగే తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రజల అండతో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించారు. ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని.. జనసేన పార్టీ దాన్ని నిలబెడుతుందని పవన్ అన్నారు. రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను సంపాదించుకున్నాం. మాటలు పడ్డా ఓర్పుతో సహించాం. ఇక చాలు. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం” అని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్ చేశారన్న ప్రచారంపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ”ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. పవన్ కు వెయ్యి కోట్లు కాదు రూ.10వేల కోట్లు ఆఫర్ చేశారు అని అనుండాల్సింది. వినడానికి కూడా బాగుండేది. నిజంగా మిమ్మల్ని, మీ ఓట్లను డబ్బుతో కొనగలనా? చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు.

డబ్బులతో అధికారంలోకి రాగలనా? మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకం అవుతాను. వెయ్యి కోట్లు ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకున్నారు. నేను వేసుకునే చెప్పులు ఫారిన్ బ్రాండ్ కాదు. జనాల్లో ఉండే వ్యక్తి స్వయంగా చేసిన చెప్పులు అవి. మరోసారి నన్ను ప్యాకేజీ స్టార్ అంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చాలా గట్టి చెప్పు దెబ్బ పడుద్ది అని అన్నారు.