ఏపీలో కూటమి భారీ విజయం..ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ

దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూసిన ఏపీ ఫలితాలు వచ్చేసాయి. కూటమి ఎవరు ఊహించని స్థాయి లో భారీ విజయం అందుకొంది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకుగాను కూటమి ఒక్కటే 165 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 136 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పోటీచేసిన అన్ని స్థానాల్లో, జయభేరి మోగించిన పార్టీగా రికార్డ్‌ సృష్టించింది.

వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి. ఇక అధికార వైఎస్సార్సీపీ కేవలం పది సీట్లకే పరిమితమై ..ఘోర ఓటమిని మూగట్టుకుంది.