శాకుంతలం ట్రైలర్ విడుదల

యావత్ సినీ ప్రేక్షకులు , సమంత అభిమానులు ఎదురుచూస్తున్న శాకుంతలం మూవీ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోగా..రిలీజ్ కు బ్రేక్ లు పడుతూ వస్తుంది. ఈ మధ్యనే ఫిబ్రవరి 17 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలిపారు.

ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. శకుంతలా దేవిగా సమంత.. దుష్యంతుడు గా దేవ్ మోహన్ కనిపించబోతున్నారు. దుష్యంతుడు శకుంతల దేవిల అద్భుత ప్రేమ కావ్యాన్ని దృశ్య రూపంగా గుణశేఖర్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ అదరగొట్టగా సినిమాలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది. శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా నటించింది. చివర్లో సింహం పై అల్లు అర్హ సూపర్ గా కనిపించింది. ఓవరాల్ గా శాకుంతలం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది.