సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

సచివాలయ కూల్చివేతపై పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

green-signal-for-the-demolition-of-the-telangana-secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌లన్నీ న్యాయస్థానం కొట్టివేసింది. అయితే సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. తద్వారా సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. పాత భవనాలను కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించినట్టయింది. కాగా ఇప్పటికే 80 శాతం భవనాలను కూల్చివేశారు. ఇక కూల్చివేతలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులను మరింత వేగంగా పుంజుకోనున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/