బిగ్ బాస్ 5 : మానస్ కు సపోర్ట్ ఇస్తున్న రామ్ హీరోయిన్

తెలుగు సీజన్ బిగ్ బాస్ 5 మరో మూడు వారాల్లో పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ఎవరు ఫైనల్స్ కు వెళ్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఇక సినీ స్టార్స్ సైతం సోషల్ మీడియా లో తమ కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం బాగానే కష్టపడుతున్నారు. తమ సపోర్ట్ ఎవరికో చెపుతూ వస్తున్నారు. తాజాగా రెడ్ హీరోయిన్ మాళవిక శర్మ మానస్‌కు అండగా నిలిచింది. ‘మానస్‌ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి ఓటేస్తున్నారని ఆశిస్తున్నాను. నా ఓటు కూడా మానస్‌కే! అతడు తప్పకుండా గెలుస్తాడని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది మాళవిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

అలాగే ప్రముఖ సింగర్‌ మధుప్రియ కూడా ఇద్దరు కంటెస్టెంట్లకు తన మద్దతు తెలిపింది. సింగర్‌ శ్రీరామచంద్రతో పాటు తన స్నేహితుడు మానస్‌కు ఓట్లేసి సేవ్‌ చేయండంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వేడుకుంది. యాంకర్‌ సమీరా, కమెడియన్‌ అదిరే అభితో పాటు పలుబురు బుల్లితెర సెలబ్రిటీలు అతడికి మద్దతు పలుకుతున్నారు. మరోపక్క సన్నీ , షన్ను లకు సైతం భారీ ఎత్తున సపోర్ట్ ఇస్తున్నారు. మరి వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారో చూడాలి. View this post on Instagram

A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)