ఉజ్బెకిస్తాన్ దగ్గు మందు ఘటన..ఆ సిరప్ తయారీ ఆపేయాలని ఫార్మా కంపెనీకి ఆదేశం

న్యూఢిల్లీః ఉజ్బెకిస్తాన్‌లో ఆ దగ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఫార్మసీ కంపెనీ మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న డాక్-1 మ్యాక్స్ దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రొపైలీన్ గ్లైకాల్ ఉన్న డ్రగ్స్‌ను మారియన్ బయోటెక్ సంస్థ తక్షణమే ఉత్పత్తిని ఆపేయాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఆ దగ్గు మందు తాగిన చిన్నారులు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవడం వల్ల.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, యూపీ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీలు డిసెంబర్ 27వ తేదీన మారియన్ బయోటెక్ కంపెనీలో తనిఖీలు చేపట్టాయి. ప్లాంట్ నుంచి సేకరించిన శ్యాంపిళ్లను టెస్టింగ్ కోసం పంపించారు. కొన్ని నెలల క్రితం గాంబియాలో కూడా మేడిన్ ఇండియా దగ్గు సిరప్‌లు తీసుకోవడం వల్లే 76 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/