బన్నీ కి ప్రత్యేక గిఫ్ట్ పంపిన రష్మిక

బన్నీ కి ప్రత్యేక గిఫ్ట్ పంపిన రష్మిక

గీత గోవిందం సినిమాతో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంది. తెలుగు , తమిళ్ తో పాటు హిందీ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈమె నటించిన పుష్ప మూవీ డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించగా , సుకుమార్ డైరెక్ట్ చేసారు. రెండు పార్ట్స్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటీకే విడుదలను పాటలు సినిమాపై అంచనాలు పెంచగా..డిసెంబర్ 06 న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.

ఈ తరుణంలో అల్లు అర్జున్ కు రష్మిక ప్రత్యేక గిఫ్ట్ పంపి ఆశ్చర్యపరిచింది. ‘మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్‌.. స్పెషల్‌గా ఏదైన పంపించాలనిపించింది. అందుకే ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ మీ కోసం’ అంటూ చేతితో రాసి నోట్‌తో పాటు కొన్ని వస్తువులను బాక్స్‌లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు. అవి చూస్తుంటే పుష్ప షూటింగ్‌లో ఉపయోగించిన చిన్న చిన్న వస్తువులను అందంగా అలంకరించి రష్మిక గిఫ్ట్‌ పంపినట్లు ఉందంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.