నేడు బీజేపీ లో చేరనున్న బూర నర్సయ్యగౌడ్

Boora Narsaiah Goud will join BJP today

హైదరాబాద్: నేడు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,చేరికలు కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బూర నర్సయ్య గౌడ్ తో పాటు కూకట్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నారు.

బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ,తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అనంతరం బీజేపీ నేషనల్​ చీఫ్ జేపీ నడ్డాను, కేంద్ర మంత్రి అమిత్ షాను నర్సయ్య కలిసే అవకాశం ఉంది.