ఈరోజు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. 70 వేల మందికి భోజనాలు

రెబెల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణ వార్త యావత్ సినీ లోకాన్నే కాదు రాజకీయ నేతలను సైతం షాక్ కు గురి చేసింది. కృష్ణం రాజు ఇక లేరు అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణించి 20 రోజులు కావొస్తున్నా ప్రతి రోజు ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక ఈరోజు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించబోతున్నారు.

ఈ సభకు కృష్ణం రాజు కుటుంబ సభ్యులు సైతం హాజరు కాబోతున్నారు. అంతే కాదు దాదాపు 70 వేల మందికి భోజనాలు ఏర్పటు చేయబోతున్నారు. దాదాపు పన్నేండేళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత గ్రామానికి వెళ్తుండడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గోనున్నారు. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం మూడు పాన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.