కాంగ్రెస్‌కు ఖుష్బూ రాజీనామా

బిజెపిలో చేరే అవకాశం!

Khushbu Sundar quits Congress

న్యూఢిల్లీ: త‌మిళ సినీ న‌టి ,కాంగ్రెస్‌ పార్టీనాయకురాలు ఖుష్బూ సోమవారం ఆ పార్టీకి రాజానామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సోమవారం పంపించారు. కాంగ్రెస్ పార్టీలోని ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రజలతో సంబంధం లేని వారు పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని ఖుష్బూ సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆరోపించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, తాను ప్రజల కోసం పనిచేసేందుకు పార్టీలో చేరానే కాని తన పేరు, ప్రతిష్ఠ కోసం కాదని ఖుష్బూ లేఖలో పేర్కొన్నారు. కాని పార్టీలోని కొన్ని శక్తులు తనను అణచివేశాయని ఖుష్బూ ఆరోపించారు.అందుకే తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించారు. తనకు పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె బిజెపిలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిస్తున్నాయి. 2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/