కైకాల పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్ జులై 25 : నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఈరోజు (జూలై 25). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఇంట్లో చిరంజీవి సందడి చేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కైకాల సత్యనారాయణతో కేక్ కట్ చేయించిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ ను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. కొంత కాలంగా వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన కైకాల సత్యనారాయణ ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి దగ్గర ఉండి ఆయన పుట్టిన రోజు వేడుకలను జరపడం కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ జులై 25 ;నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఈరోజు (జూలై 25). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఇంట్లో చిరంజీవి సందడి చేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కైకాల సత్యనారాయణతో కేక్ కట్ చేయించిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ ను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. కొంత కాలంగా వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన కైకాల సత్యనారాయణ ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి దగ్గర ఉండి ఆయన పుట్టిన రోజు వేడుకలను జరపడం కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తన ట్విట్టర్ ద్వారా పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజునవారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను అంటూ చిరంజీవి ట్విట్ చేశారు. అలాగే చిరంజీవి తమ ఇంటికి రావడం పట్ల కైకాల సత్యనారాయణ సోదరుడు నిర్మాత కైకాల నాగేశ్వరరావు స్పందించారు.

అన్నయ్య పుట్టిన రోజున చిరంజీవి మా ఇంటికి రావడమే కాకుండా అన్నయ్యతో చాలా సమయం గడిపారు. ఆయనకు ధైర్యాన్నిచ్చారు. అన్నయ్యతో పాటు మాలోనూ కొండంత ధైర్యాన్ని నింపారుఅని తెలిపారు. ఇక చిరంజీవి కైకాల సత్యనారాయణ కలయికలో ఎన్నో సినిమాలు వచ్చి అలరించాయి. అంతే కాదు కైకాల సత్యనారాయణ రమా ఫిలింస్ బ్యానర్ లోకొదమసింహం` చిత్రాన్ని చిరంజీవి తో చేసారు. ఈ మూవీ కౌబాయ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.