పెళ్లి వార్తల ఫై హీరో రామ్ క్లారిటీ ..

రెండు , మూడు రోజులుగా తనపై వస్తున్న పెళ్లి వార్తల ఫై హీరో రామ్ క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసాడు. రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడని , అదికుడా ప్రేమ వివాహమని, తన చిన్ననాటి క్లాస్‌మేట్‌తో లవ్‌లో ఉన్నాడని, కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న వీళ్లిద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని , ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని, పెళ్లి మాత్రం నవంబర్ నెల కార్తీకమాసంలో జరుపుకోబోతున్నారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు చూసి అభిమానులే కాదు చిత్రసీమకు చెందిన వ్యక్తులు సైతం రామ్ కు ఫోన్లు చేసి అడగడం స్టార్ట్ చేశారట. ఇక ఇలాగే సైలెంట్ గా ఉంటె బాగోదని రామ్ ఈ వార్తలకు చెక్ పెట్టాడు.

ఓరి దేవుడా.. ఆపండి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నేను నా స్కూల్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నాను అను రూమర్లు ఇంటి వరకు చేరాయి. వారికి కూడా అవన్నీ గాలివార్తలే అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పట్లో ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కి కూడా వెళ్లేవాడిని కాదుఅంటూ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్లారిటీ తో రామ్ పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.