ఆరెస్సెస్ చీఫ్ ట్విట్టర్ బ్లూటిక్ కూడా తొలగింపు

మరో నలుగురు ప్రముఖుల ఖాతాలకూ తొలగింపు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్‌ వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమే అయితే దానికి కనీసం సమాచారమైనా ఇవ్వాలి కదా? అని ఆరెస్సెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కాగా, ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను తొలగించి, ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లూ టిక్ ను పునరుద్ధరించింన విషయం తెలిసిందే.

Twitter drops verified blue badge from RSS leaders handles

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/