ఓటిటి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన నిర్మాతలు

కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ ఓటిటికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ..ప్రేక్షకులు థియేటర్స్ కు అలవాటు పడడం లేదు. అంతే కాక పెద్ద సినిమా , చిన్న సినిమా అనే తేడాలు లేకుండా విడుదలైన రెండు వారాలకే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతుండడం తో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడడం లేదు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్​ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుందని వారు తెలిపారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. అలాగే హీరోల క్రేజ్‌ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చలు జరిపిన నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఓటీటీ రిలీజ్​పై నిర్ణయం తీసుకున్నారు.