హీరో కృష్ణ నిజ‌మైన లెజెండ్ న‌టుడు: మంత్రి కెటిఆర్

hero-krishna-is-a-truly-legendary-actor-tweets-minister-ktr

హైదరాబాద్: సూప‌ర్ స్టార్ కృష్ణ ఈరోజు క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల మంత్రి కెటిఆర్ స్పందించారు. తెల్ల‌వారుజామునే ఓ విషాదక‌ర వార్త‌తో నిద్ర లేచాన‌ని, హీరో కృష్ణ నిజ‌మైన లెజెండ్ న‌టుడు అని, తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మ‌ర్యాద‌పూర్వ‌క న‌టుడు అని మంత్రి కెటిఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషాద‌క‌ర స‌మ‌యంలో కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల ఆయ‌న కుమారుడు హీరో మ‌హేశ్‌కు హృద‌యపూర్వ‌క శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నాన‌ని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు పేరెంట్స్‌ను కోల్పోవ‌డం విషాద‌క‌ర‌మే అని మ‌హేశ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/