నేడు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

మెడికల్ కాలేజీలకు జిల్లా ఆసుపత్రుల అనుసంధానం

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్‌ః తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈరోజు (నవంబరు 15) ప్రారంభం కానున్నాయి. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే.

సిఎం కెసిఆర్ వర్చువల్ విధానంలో ఒకేసారి ఈ మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించనున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదు ప్రగతి భవన్ నుంచి సిఎం కెసిఆర్ ఆన్ లైన్ ద్వారా ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభిస్తారు.

కాగా, రూ.4,080 కోట్ల వ్యయంతో ఈ వైద్య కళాశాలలను నిర్మించారు. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/