జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 6.1 తీవ్రత

టోక్యోః జపాన్‌లో పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదయింది. జపాన్‌లోని పెద్ద ద్వీపకల్పమైన హోన్షుకి దక్షిణ తీరంలోని కన్సాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. మై ప్రెఫెక్టర్ దగ్గర సాయంత్రం 5:30 గంటలకు 357 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
రాజధాని టోక్యోతో పాటు చుట్టు పక్కల నగరాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించిందని అమెరికాకు చెందిన యూనైటెడె స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ద్వీపకల్పంలో భూకంపం రావడంతో సునామీ వస్తుందేమోనని అధికారులు అనుకున్నారు. అయితే, అయితే, వాతావరణ శాఖ మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫుకుషిమా అణుఇంధన కేంద్రంలో ఎవరికీ గాయాలుగానీ, ప్రాణనష్టం కాని సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా బుల్లెట్ రైళ్లు, టోక్యో మెట్రోరైళ్లను నిలిపివేశారు. ఆ తర్వాత వాటిని పునరుద్దరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/