ఏపీలో తొలి ఫలితం వచ్చేది అక్కడే..

నరాలు తెగే ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. ఏపీలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది..? అనేది తెలియబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు ఈసీ. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేస్తారు. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది. రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో తొలి ఫలితం రానుండగా.. అమలాపురం ఫలితం ఆలస్యం కానుంది. EVM కౌంటింగ్ కు ఒక్కో రౌండ్ కు 20-25 నిమిషాలు పట్టనుండగా మధ్యాహ్నం 1 కల్లా మెజార్టీ ఎవరిదో తేలనుంది.