నార్త్ లో దసరా హావ కనపడడం లేదు

నాని నటించిన దసరా మూవీ పాన్ ఇండియా గా పలు భాషల్లో శ్రీరామ నవమి సందర్బంగా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంటే..నార్త్ లో మాత్రం దసరా సందడి కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగు లో కన్నా నార్త్ లోనే నాని ఎక్కువ ప్రమోషన్ చేసారు. అన్ని సిటీస్ వెళ్తూ ప్రజలతో మమేకం అయ్యారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే ఎందుకనో నార్త్ బెల్ట్ లో మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. పుష్ప మూవీకి సాలిడ్ గా ప్రేక్షకాదరణ రావడంతో కచ్చితంగా ఈ మూవీకి కూడా వస్తుందని అంచనా వేశారు. కానీ వారి అంచనా రివర్స్ అయ్యింది. అయితే అదే రోజు అజయ్ దేవగన్ భోళా సినిమా రిలీజ్ కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆ మూవీ చూడటానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే దసరా నార్త్ ఇండియాలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మరి ఈ వీకెండ్ లో మౌత్ టాక్ తో ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.

నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.