ప్రారంభమైన ఏపి కేబినెట్‌ సమావేశం

అమరావతి: ఏపి కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. సిఎం జగన్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులు కేబినెట్‌లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు, కార్మికులు చేస్తోన్న ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది. శాసన రాజధాని కోసం 3000 కోట్లు బాంక్ గ్యారంటీ అంశంపై కేబినెట్‌లో చర్చ జరుగనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/