చంద్రబాబు అరెస్ట్‌పై హీరోయిన్‌ పూనమ్‌ కౌర్ రియాక్షన్‌

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ఫై యావత్ తెలుగు ప్రజానీకం తప్పుపడుతుంది. చంద్రబాబు ను జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్యగా అరెస్ట్ చేయించిందని వారంతా వాపోతున్నారు. మరోపక్క ఇతర పార్టీల నేతలు సైతం చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ టీడీపీ అధినేత అరెస్టుపై స్పందించింది. ’73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదు. ముఖ్యంగా, ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండడం బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న విషయాలపై మాట్లాడడానికి నాకెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. అయితే మానవత్వంతో మాత్రమే స్పందిస్తున్నాను. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యం, వయసును పరిగణనలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌.