అమూల్ పాల ధరలు మరోసారి పెంపు

amul-raises-milk-prices-by-rs-2-over-rising-input-costs

నేటి నుంచి పాల ధరలు పెంచుతూ అమూల్ ప్రకటన విడుదల చేసింది. గేదే పాలు 500 మి.లీ ప్యాకెట్పై రూ.2, లీటర్ పాల ప్యాకెట్పై రూ.3 పెంచింది. గోల్డ్, తాజా రకం పాలపై లీటర్కు రూ.2, హాఫ్ లీటరు రూ.1 చొప్పున పెంచినట్లు పేర్కొంది. ఆవు పాలు హాఫ్ లీటర్ ప్యాక్, లీటర్ ప్యాక్పై రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమూల్ పేరుతో GCMMF పాల ఉత్పత్తులను విక్రయించడం తెలిసిందే. అమూల్ తాజా నిర్ణయంతో అన్ని వేరియంట్లు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ టీ స్పెషల్ మిల్క్ ధరలు సోమవారం నుంచి లీటరుపై రూ.2 చొప్పున పెరుగుతాయి. దేశ వ్యాప్తంగా అమూల్ సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి.

ధరల పెంపు అనంతరం ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.73కి చేరుకుంది. అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర రూ.66 నుంచి రూ.68 కాగా, అమూల్ శక్తి లీటరుకు రూ.60కి చేరుకుంది. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56 కాగా, ఆఫ్ లీటర్ రూ.28కి చేరింది. అమూల్ గేదె పాలు ఆఫ్ లీటర్ రూ.37, అమూల్ గోల్డ్ ఆఫ్ లీటర్ రూ.34, అమూల్ శక్తి అర్ధ లీటర్ రూ.30 అయింది.

అమూల్ ఆవు పాల ధర లీటర్ రూ.57 కాగా, అర్ధ లీటర్ రూ.29కి పెరిగింది. అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ కస్టమర్లు అర్ధ లీటర్ పై రూ.25, లీటర్ పౌచ్ పై రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. సాగర్ స్కిమ్మిడ్ పాల ధర ఆఫ్ లీటర్ రూ.20, లీటర్ ధర రూ.40 వద్ద స్థిరంగా ఉన్నాయి.