హైదరాబాద్ లో భారీ వర్షం..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

మరోసారి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దాదాపు గంట నుండి కుండపోత వర్షం పడుతుండడం తో నగరవాసులు అతలాకుతలం అవుతున్నారు. సరిగ్గా ఆఫీస్ ల నుండి బయటకు వచ్చే సమయంలో వర్షం పడుతుండడం తో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జాం నడుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో GHMC అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తుంది. అలాగే ఆఫీస్ లలో ఉన్న వారు..ఆఫీస్ ల్లోనే ఉండాలని , వర్షం తగ్గిన తర్వాతే బయటకు రావాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారింది. ఇక సోషల్ మీడియా లోను పెద్ద ఎత్తున అలర్ట్ ప్రకటిస్తున్నారు.

నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయినపల్లి, జవహర్‌నగర్‌, బేగంపేట, బొల్లారం, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్సీగూడలో భారీ వర్షం పడుతుంది. మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, చైతన్యపురి, గుడి మల్కాపూర్‌, నాంపల్లి, మల్‌కపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్టా, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, బషీర్‌బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తున్నది. కూకట్‌పల్లి, కాచిగూడ, విద్యానగర్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, ఘట్కేసర్‌, రాజేంద్రనగర్‌, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.